Wednesday, January 7, 2026

Quotations


"Take Time to Improve, But don't waste time to Prove"










Sample Speeches

 


Namaste and a very good evening to all. Special salutations to the guests on the stage.

 

First, I would like to express my heartfelt gratitude to the organizing committee for providing me this wonderful opportunity to speak about my beloved brother on this special occasion.

 

Today , an auspicious Day and very remarkable day for all of our extended family members to celebrate retirement function of my brother Satyanarayana Raju.

We used to stay next door to their house and have privilege to witness his hardwork, extra ordinary journey since my childhood. He used to teach and support during our studies.

There is a saying in Telugu “Nindu kunda tonakadu”, “ Full pot never spills out”. He is well known for his commitment, hardwork and stubbornness towards achieving goals. No shortcuts, no compromises, just dedication to excellence.  Once he commits, Jhukega Nahi…..

We often hear, a personality development mantra  “Dream big,” for career growth. But his life shows something deeper: “When a mother’s love dreams big and you stick to that dream… this is the outcome.”  That’s why I always used to feel him as son of Rama seetha….

Congratulations Annayya for this remarkable journey. Surely your legacy inspires generations.

Annayya, All the best for next Milestone….

Friday, September 15, 2023

Subhashitamulu

 


వేదమూల మిదం బ్రాహ్మం, భార్యామూల మిదం గృహం,

కృషిమూల మిదం ధాన్యం, ధనమూల మిదం జగత్.

వేదములే బ్రాహ్మణత్వమునకు మూలము; గృహిణియే గృహమునకు మూలము ; కృషియే ధాన్యమున కుద్పాదకము ; ధనమే జగద్వ్యవహారమునకు మూలము.

 

సిరి దాఁ వచ్చిన వచ్చును 

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరి దాఁ బోయినఁ బోవును 

కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ

 

 

శ్లో!!
మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!
భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే!
అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్!
తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!! --సుభాషిత రత్నభాండారమ్

ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు.

 

 

 

 

 

 

 

శ్లోII
సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయాత్I
బ్రూయా త్సత్య మప్రియంI
ప్రియం చ నానృతం బ్రూయాత్I
ఏష ధర్మ స్సనాతనఃII మనుస్మృతి

సత్యమునే పలుకుము; ప్రియమునే మాటాడుము; సత్యమైనను అప్రియమును పలుకకుము; ప్రియముగదా యని అనృతము నాడకుము.ఇదే సనాతన ధర్మము.

 

శ్లో!!
ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!! హితోపదేశం

పశువులు,భార్యాపుత్రాదులు,ఇండ్లు వాకిండ్లు - ఇవి ఋణానుబంధ రూపముగా వచ్చి, ఋణము తీరగనే మళ్ళీ మనుష్యుని వదలి పోతున్నాయి. అట్టి వానిని గూర్చి ప్రాజ్ఞులు విచారించరు గదా.

 

 

శ్లో!!
పరోపకారాయ ఫలంతి వృక్షాః!
పరోపకారాయ వహంతి నద్యాః!
పరోపకారాయ చరంతి గావః!
పరోపకారార్థ మిదం శరీరం!!

పరులకొరకయే చెట్లు పండ్ల నిస్తున్నాయి;నదులు ప్రవహిస్తున్నాయి;గోవులు పాల నిస్తున్నాయి;ఈ శరీరములు పరోపకారార్థమే గదా!

 

 

 

 

శ్లోII
ధర్మ ఏవ హతో హంతిI
ధర్మో రక్షతి రక్షితఃI
తస్మా ద్ధర్మో న హంతవ్యోI
మానో ధర్మో హతో2వధీత్II మనుస్మృతి-8-15

ధర్మమును బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది.ధర్మ రక్షణము చేస్తే మనకున్నూ రక్షణ కలుగుతుంది.గాన ధర్మమును నాశము చేయకూడదు.మిమ్ము నశింపచేసుకోవాలని కోరరు గదా!

 

శ్లో!!
అహింసా ప్రథమం పుష్పం పుష్ప మింద్రియనిగ్రహం!
సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విషేషతః!
శాంతిః పుష్పం తపః పుష్పం ధ్యానపుష్పం తథైవచ!
సత్య మష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్!!

అహింస,ఇంద్రియనిగ్రహము,సర్వభూతదయ,క్షమ,శాంతి,తపము,ధ్యానము,సత్యము - యీ ఎనిమిది గుణములున్ను విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరములైన పుష్పములు. ఈ పువ్వులచేత పూజించిన విష్ణువు తృప్తుడగును గాని యితరపూవులచేత గాదుసుమా.

సుగుణాలనన్నీ పుష్పాలతో పోలుస్తూ ఆయా సుగుణము లెవరెవరి వద్ద వుంటాయో, అట్టివారు భగవంతునికి ప్రేమపాత్రులవుతారనడం - ఆ యా సుగుణాలను అందరూ అలవరచుకోమని ప్రబోధించటం అన్నమాట.

 

 

 

 

శ్లో!!
యత్రనార్యస్తు పూజ్యంతే!
రమంతే తత్ర దేవతాః!
యత్రై తాస్తు న పూజ్యంతే!
సర్వాస్తత్రా2ఫలాఃక్రియాః!! మనుస్మృతి 3-56

స్త్రీలు పూజింపబడుచున్నచోట్లనే దేవతలు క్రీడింతురు.స్త్రీలకు గౌరవము ఈయబడని తావుల జరుగు సర్వ క్రియలును నిష్ఫలములే.

 

 

శ్లో!!
మూర్ఖాణాం పండితా ద్వేష్యాః!
నిర్ధనానాం మహాధనాః!
వ్రతినః పాపశీలానాం!
అసతీనాం కులస్త్రియః!! హితోపదేశం

లోకంలో మూర్ఖులు పండితులను, పేదనాళ్ళు ధనవంతులను,పాపవర్తనులు సచ్ఛీలురను, కులటలు పతివ్రతలను ద్వేషిస్తుంటారు.ఇది వారికి సహజం గానే కనిపిస్తుంది కూడాను.అందుకనే లోకమున అత్యధిక సంఖ్యాకులుగా ఉండే మొదటి తరహావాళ్ళకు పాపభీతిని కలిగించుటకే శాస్త్రములు యత్నించినవి.
హితోపదేశంలో ఇటువంటి నీతులెన్నెన్నో ఉన్నవి.

 

 

 

 

 

 

 

 

 

 

 

ద్వయం ద్వయం చైవ బ్ర త్రయం చతుష్టయం

అనాపలింగకుస్క ని పురాణాని పృథక్ పృథక్

- మత్స్య , మార్కండేయ పురాణం

 - భాగవత ,భవిష్య పురాణం

బ్ర  - బ్రహ్మ,బ్రహ్మాండ,బ్రహ్మవైవర్త పురాణం

- వాయు,వామన,విష్ణు,వరాహ పురాణం

అ - అగ్ని పురాణం

నా  - నారద పురాణం

 - పద్మ పురాణం

లిం - లింగ పురాణం

గ - గరుడ పురాణం

కూ  - కూర్మ పురాణం

స్క  - స్కంద పురాణం

 

 

అభిషేకే రథారోహే దంపతే శయనే తథా

శ్రద్ధా స్నానే తథా స్నానే పత్ని తిష్టతి వామతే !

కన్యాదానే వివాహేచ ప్రతిష్ట యజ్ణ కర్మాణి

కార్యేషు సర్వ ధర్మ కార్యేషు పత్ని తిష్టతి దక్షిణే !

 

వేయి ప్రశ్నలుండు విజ్ణాన వేత్త కు

ప్రశ్నలుండబోవు పామరునకు

విజ్ణుడౌను పౌరుడు జిజ్ఞాస చేతనే

నార్లవారి మాట నవయుగాల బాట !

 

 

 

కలడందురు దీనుల యెడ

కలడందురు పరమయోగి గణములపాలం,

గలడందు రన్ని దిశలను,

గలడు గలం డనెడివాడు గలడో? లేడో? - గజేంద్ర మోక్షం

 

 

పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతం

అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టుం చ ఖండశుః

 

 

ఆకశాత్పతీతమ్ తోయమ్ సదా గచ్ఛతి సాగరం

సర్వదేవ నమస్కారం కేశవమ్ ప్రతి గచ్ఛతి

 

Aadho Rama thapo vananu gamanam, Hathwa mrugam kanchanam,
Vaidehi haranam, jatayu maranam, Sugreeva sambhashanam,
Bali nigrahanam, samudhra tharanam, Lanka pureem dahanam,
Paschad Ravana Kumbha karna madanam, Ethat ithi Ramayanam

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నీల యత్కుచేల మౌని పాలితం కృపాకరం

 నీళ నీళ మింద్ర నీల  నీల కాంతి మోహనం

బాల నీల చారు కొమలాలకం విలాస గో

పాల బాల జార  చోర బాలకృష్ణ మాశ్రయే !!

 

ఇందు కుంద మందహాస మిందిరా  ధరాధరం  

నందగోప నందనం సనందనాది వందితం

నందగోధనం సురారి మర్దనం సమస్త గో

పాల బాల జార  చోర బాలకృష్ణ మాశ్రయే !!

 

వారిహార హీర చారు కీర్తితం విరాజితం

ద్వారకా విహారమం భుజారి సూర్య లోచనం

భూరి మేరు ధీరమాది కారణం సుశేవ్య  గో

పాల బాల జార  చోర బాలకృష్ణ మాశ్రయే !!

 

శేష భోగ శాయినం విశేష భూషణోజ్వలం

యోషమాన కింకిణీ   విభీషణాది   పోషణం

సోషనాక్రుతాంభుదిం విభీషణార్చితం పదం గో

పాల బాల జార  చోర బాలకృష్ణ మాశ్రయే !!

 

పండితాఖిల స్తుతం పుండరీక భాస్కరం

కుండలప్రభాసమాన తుండ దండ  మండలం

పుండరీక సన్నుతం జగన్నుతం మనోజ్ఞకం గో

పాల బాల జార  చోర బాలకృష్ణ మాశ్రయే !!

 

ఆంజనేయ ముఖ్యపాల వానరేంద్ర కృంతనం

కున్జరారి భంజనం నిరంజనం శుభాకరం

మంజు కంజ పత్రనేత్ర రాజితం విరాజితం  గో

పాల బాల జార  చోర బాలకృష్ణ మాశ్రయే !!

 

రామణీయ యజ్ఞ ధామ భామినీ వరప్రదం 

మనోహరం  గుణాభిరామ ఉన్నతోన్నతం గురుం

సామ గాన వేణు నాద లోల మర్జితాస్తకం  గో

 పాల బాల జార  చోర బాలకృష్ణ మాశ్రయే !!

 

 రంగ దింది రాంగ మంగళాంగ సౌర్య భాసదా

 సంగ దాసురోత్తమాంగా  భంగక ప్రదాయకం

తుంగ వైరవాభి  రామ  మంగళామృతం గో

పాల బాల జార  చోర బాలకృష్ణ మాశ్రయే !!

 

బాలకృష్ణ పుణ్యనామ లాలితం శుభాష్టకం  

యే పత్తంటి సాత్వికొత్తమా సదా ముదాచ్యుతం

రాజమాన పుత్ర సంపదాది శోభనానితే   

సాధయంతి విష్ణులోక  మభ్యయం నరాష్ట తే !!